Daily Current Affairs in Telugu: 2022, జూన్ 11th కరెంట్ అఫైర్స్
US inflation hits 40-year high: 40 ఏళ్ల గరిష్టానికి అమెరికా ద్రవ్యోల్బణం
- ప్రపంచంలోని పలు దేశాల తరహాలోనే అమెరికా కూడా వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. మే నెల్లో వినియోగ ద్రవ్యోల్బణం 8.6 శాతంగా నమోదయ్యింది. గడచిన 40 సంవత్సరాల్లో (1982 తర్వాత) ఈ స్థాయి ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి.
- గ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలు మే నెల్లో భారీగా పెరిగాయి. ఏప్రిల్‌తో పోల్చితే ద్రవ్యోల్బణం ఒక శాతం పెరిగినట్లు కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది.
- అయితే ఫెడ్ ఫండ్ వడ్డీరేట్ల పెంపు పక్రియ, వినియోగ వ్యయం తయారీ వస్తువుల నుంచి సేవల్లోకి మారడం వంటి అంశాల నేపథ్యంలో ఈ సంవత్సరం చివరికి ద్రవ్యోల్బణం 7 శాతానికి దిగిరావచ్చన్న అంచనాలు ఉన్నాయి.
- ఎకానమీ మాంద్యంలోకి జారకుండా జాగ్రత్తపడుతూ, వ్యయాల తగ్గింపు–వృద్ధి పెంపు లక్ష్యంగా రేట్ల విధానం కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ భావిస్తోంది.
Boost for India rating: భారత్ రేటింగ్ అంచనా పెంపు
- భారతదేశ సార్వభౌమ రేటింగ్‌కు సంబంధించి ‘అవుట్‌లుక్’ను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రెండేళ్ల తర్వాత ‘నెగెటివ్’ నుండి ‘స్థిరం’కు అప్‌గ్రేడ్ చేసింది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ వల్ల మధ్య–కాల వృద్ధికి ఎదురయ్యే సవాళ్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే రేటింగ్‌ను మాత్రం ‘బీబీబీ (–) మైనస్’గా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
- భారత్ సార్వభౌమ రేటింగ్‌ను ఫిచ్ 2006 ఆగస్టులో ‘బీబీబీ–’కు అప్‌గ్రేడ్ చేసింది. అప్పటి నుంచి ఇదే రేటింగ్ కొనసాగుతోంది. అయితే అయితే అవుట్‌లుక్ మ్రాతం ‘స్టేబుల్’–‘నెగటివ్’మధ్య ఊగిసలాడుతోంది. భారత్ ఎకానమీ రికవరీ వేగవంతంగా ఉందని, ఫైనాన్షియల్ రంగం బలహీనతలు తగ్గుతున్నాయని ఫిచ్ తాజాగా పేర్కొంది.
- అంతర్జాతీయంగా కమోడిటీ ధరల తీవ్రత వల్ల సవాళ్లు ఉన్పప్పటికీ ఎకానమీకి ఉన్న సానుకూల అంశాలు తమ తాజా నిర్ణయానికి కారణమని తెలిపింది. మరిన్ని అంశాలను పరిశీలిస్తే..
- ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022–23లో భారత్ ఎకానమీ అంచనాలను 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నాం. మార్చిలో వేసిన అంచనాలు 8.5 శాతం నుంచి 7.8 శాతానికి కుదిస్తున్నాం. అంతర్జాతీయ కమోడిటీ ధరల తీవ్రత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, కఠిన ద్రవ్య విధానం దీనికి కారణాలు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 8.7 శాతం పురోగమించింది.
- కోవిడ్ –10 మహమ్మారి షాక్ నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ దృఢమైన రికవరీని కొనసాగిస్తోంది.
- సహచర వర్థమాన దేశాలతో పోల్చితే భారత్ పటిష్ట వృద్ధిలో పయనిస్తోంది. ఇది ఎకానమీపై మా అవుట్‌లుక్ మారడానికి కారణం.
Adobe may set up centre for research at OU : ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం
- ఉస్మానియా క్యాంపస్‌లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలి పారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను జూన్ 10(శుక్రవారం) ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా పంచుకున్నారు.
- శాన్ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్‌తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్‌లో భాగంగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్‌ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్‌లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్ ప్రతి పాదించినట్టు రవీందర్ చెప్పారు.
- ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్ర వేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్ అజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్‌లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు.
UNGA adopts resolution on multilingualism, mentions Hindi language for first time: ఐరాస తీర్మానంలో హిందీ
- ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ జూన్ 10(శుక్రవారం) బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి.
- ఆరు అధికార భాషలైన ఇంగ్లిష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్ తో పాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలీ, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తరప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది.
Modi opens 'in-space' office : ‘ఇన్–స్పేస్’ ఆఫీసు ప్రారంభించిన మోదీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండియన్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) మోదీ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్ స్పేస్ సెక్టార్‌లోనూ భారత సంస్థలు అగ్రగామికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో గతంలో ప్రైవేట్ సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. స్పేస్ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించామని వివరించారు. ప్రైవేట్ రంగానికి ఇన్–స్పేస్ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Lakhs of crores of treasure in the womb of the sea: సముద్ర గర్భంలో లక్ష కోట్ల నిధి
- 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్‌జోస్ మునిగిపోయింది.
- స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్‌తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి.
- ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది!
-
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్ -
చదవండి: Daily Current Affairs in Telugu >> 2022, జూన్ 10 కరెంట్ అఫైర్స్