థాయ్‌లాండ్ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యపై నిషేధం
Sakshi Education
నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో... థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) నిషేధం విధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్)
ఎందుకు : నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో
దీంతో ఈ రెండు దేశాల లిఫ్టర్లు వచ్చే 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు దూరం కానున్నారు. థాయ్‌లాండ్‌పై మూడేళ్ల నిషేధం విధించడంతోపాటు 2 లక్షల డాలర్ల జరిమానా వేశామని... మలేసియాపై ఏడాదికాలం నిషేధం విధించామని ఐడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఏప్రిల్ 1న నిషేధానికి సంబంధించిన సమాచారం థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలకు ఇచ్చామని, నిషేధంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీల్ చేసుకునేందుకు 21 రోజుల గడువు ఉందని వెల్లడించింది. 2018 ప్రపంచ చాంపియన్ షిప్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన తొమ్మిది మంది లిఫ్టర్లు డోపింగ్‌లో పట్టుబడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : థాయ్‌లాండ్, మలేసియా వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్యలపై నిషేధం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్)
ఎందుకు : నిర్ణీత సంఖ్యలో కంటే ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో
Published date : 06 Apr 2020 06:24PM