టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళా గోల్ఫర్?
Sakshi Education
భారత మహిళా స్టార్ గోల్ఫర్ అదితి అశోక్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ‘టోక్యో’ గేమ్స్‌కు అర్హత పొందిన 60 మంది మహిళా క్రీడాకారిణుల జాబితాను జూన్ 29న అంతర్జాతీయ గోల్ఫ్ సమాఖ్య (ఐజీఎఫ్) విడుదల చేసింది.
ఈ జాబితాలో అదితి 45వ స్థానంలో ఉంది. కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల అదితికిది వరుసగా రెండో ఒలింపిక్స్. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె 41వ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో భారత్ నుంచి అనిర్బన్ లాహిరి, ఉదయన్ మానె టోక్యో ఒలింపిక్స్ బరిలో ఉన్నారు.
జూడో క్రీడాంశంలో బరిలోకి దిగనున్న ఏకైక భారత క్రీడాకారిణి?
ఆసియా జోన్ కోటా ద్వారా భారత జూడో క్రీడాకారిణి సుశీలా దేవి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సంపాదించింది. మణిపూర్‌కు చెందిన 26 ఏళ్ల సుశీలా దేవి మహిళల 48 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆసియా కోటాలో 10 బెర్త్‌లు ఉండగా... సుశీలా 989 పాయింట్లతో ఏడో స్థానంలో నిలువడంతో ఒలింపిక్ బెర్త్ ఖరారైంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి జూడో క్రీడాంశంలో బరిలోకి దిగనున్న ఏకైక క్రీడాకారిణి సుశీలానే కావడం విశేషం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళా గోల్ఫర్?
ఎప్పుడు : జూన్ 29
ఎవరు : అదితి అశోక్
ఎక్కడ : టోక్యో, జపాన్

Published date : 30 Jun 2021 06:02PM