టీ-చిట్స్ వెబ్‌సైట్‌కు ఈ-గవర్నెన్స్ పురస్కారం
Sakshi Education
చిట్‌ఫండ్ వ్యాపారాన్ని నియంత్రించేందుకు అత్యాధునిక బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘టీ-చిట్స్’ వెబ్‌సైట్‌కు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది.
2020 ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ముంబైలో జరగనున్న 23వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహిస్తోన్న టీ-చిట్స్‌కు బ్లాక్‌చైన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టులో భాగంగా రూపకల్పన చేశారు. టీ-హబ్ కేంద్రంగా పనిచేస్తున్న చిట్‌మాంక్స్ అనే స్టార్టప్ కంపెనీ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. బ్లాక్‌చైన్ పరిజ్ఞానం ఆధారంగా చిట్‌ఫండ్ లావాదేవీల సమాచారానికి భద్రత చేకూరిందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : టీ-చిట్స్ వెబ్‌సైట్
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : టీ-చిట్స్ వెబ్‌సైట్
Published date : 25 Jan 2020 05:28PM