Skip to main content

తెలంగాణలో సీఐఐ స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
Current Affairsతెలంగాణలో స్టార్టప్స్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కేంద్రం పని చేస్తుందని, 2020, ఏప్రిల్ నుంచి ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సీఐఐ ఫిబ్రవరి 25న తెలిపింది. వినూత్న ఆలోచనలు, స్టార్టప్స్‌కు మెంటారింగ్, అవకాశాలు, వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక ప్రోత్సాహం అందించడమే ఈ సెంటర్ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌కు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్, సీఐఐ నేషనల్ స్టార్టప్ కౌన్సిల్ చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్‌కు చెందిన ప్రతీక్ష చారిటబుల్ ట్రస్ట్ సహకారం అందించనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్టార్టప్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 258
ఎవరు : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్ కోసం
Published date : 26 Feb 2020 05:53PM

Photo Stories