తెలంగాణ సమాచార కమిషనర్ల ప్రమాణస్వీకారం
Sakshi Education
తెలంగాణ సమాచారహక్కు చట్టం (ఆర్‌టీఐ) కమిషనర్లుగా సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్‌రెడ్డి, మైదా నారాయణరెడ్డి, గిరిజన విద్యార్థి నేత గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు సయ్యద్ ఖలీలుల్లా, మహ్మద్ అమీర్ హుస్సేన్ ఫిబ్రవరి 25న ప్రమాణస్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్‌లో వారితో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎస్.రాజా సదారాం ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఐదుగురు కమిషనర్లు బాధ్యతలు స్వీకరించారు. పదవీబాధ్యతలు చేపట్టిన నాటినుంచి వీరు మూడేళ్లపాటు లేదా 65 ఏళ్లు నిండే వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.

Published date : 26 Feb 2020 05:55PM