Skip to main content

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్

తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా శశాంక్ గోయల్‌ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) మార్చి 6న ఉత్తర్వులు జారీ చేసింది.
Current Affairs1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శశాంక్ ప్రస్తుతం కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాల శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డెరైక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు.

గతంలో రాష్ట్ర సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా రజత్ స్థానంలో శశాంక్ నియమితులయ్యారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)గా నియామకం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : శశాంక్ గోయల్
Published date : 07 Mar 2020 05:47PM

Photo Stories