Skip to main content

Suicide bomber strikes: కాబూల్ విమానాశ్రయం వద్ద ఆత్మాహుతి దాడులు

కాబూల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆగస్టు 26న ఆత్మాహుతి దాడులు జరిగాయి.
రెండు బాంబుపేలుళ్లలో 95 మంది అఫ్గాన్‌ పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించగా... మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా. ఈ దాడులకు దాడికి తమదే బాధ్యతని అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ – ఖోరాసన్‌ (ఐసిస్‌–కె) ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. అమెరికా సైనికులు, వారి అఫ్గాన్‌ మిత్రులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది.

ఐసిస్‌–కెపై డ్రోన్‌ దాడి
ఆగస్టు 26న జరిగిన కాబూల్‌ బాంబుదాడికి ప్రతీకారంగా అమెరికా... ఐసిస్‌–కె సూత్రధారులిద్దరిని డ్రోన్‌దాడిలో హతమార్చింది. అఫ్గాన్‌లోని నాన్‌గర్హర్‌ ప్రావిన్సు ప్రాంతంలోని ఐసిస్‌ స్థావరాలపై ఆగస్టు 28న ఈ దాడి జరిగినట్లు అమెరికా ప్రతినిధులు తెలిపారు.

ఇది కూడా చదవండి:
ఐసిస్‌–కె(ISIS-K): అసలు ఏమిటి ఉగ్ర సంస్థ? ఎలా అరాచకాలు చేస్తోంది?


ఆగస్టు 29న...
ఆగస్టు 29న కాబూల్‌ విమానాశ్రయ పరిసర ప్రాంతాలు వేర్వేరు దాడులతో దద్దరిల్లాయి. విమానాశ్రయానికి సమీపంలోని ఖజే భాగ్రా ప్రాంతంలో ఒక నివాస ప్రాంతంపై ఐసిస్‌–కెకి చెందిన ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారు జరిపిన రాకెట్‌ దాడిలో ఒక చిన్నారి సహా ఆరుగురు మరణించినట్టుగా అఫ్గానిస్తాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. మరోవైపు అమెరికా సైనికులే లక్ష్యంగా ఐసిస్‌–కె ఉగ్రవాదులు తలపెట్టిన ఆత్మాహుతి దాడిని అమెరికా భగ్నం చేసింది. విమానాశ్రయం వైపు ఆత్మాహుతి బాంబర్లతో దూసుకొస్తున్న ఒక వాహనంపై అమెరికా డ్రోన్‌తో దాడి జరిపింది.
Published date : 31 Aug 2021 01:46PM

Photo Stories