సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Sakshi Education
మూడో విడత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీ నివేదికను నీతి ఆయోగ్ జూన్ 3న ఢిల్లీలో ఆవిష్కరించింది.
‘‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ; డాష్ బోర్డ్ 2020–21 : దశాబ్ద కాలపు కార్యాచరణలో భాగస్వామ్యాలు’’ పేరుతో సూచీని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకేపాల్, సీఈవో అమితాబ్ కాంత్, సలహాదారు సంయుక్త సమద్దార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్డీజీ సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. 69 పాయింట్లతో తెలంగాణ రాష్ట్రం ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
నాణ్యమైన విద్యుత్‌లో ఏపీ అగ్రగామి..
నాణ్యమైన విద్యుత్‌లో ఏపీ అగ్రగామి..
2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ, తెలంగాణ సహా మరో 14 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ విభాగంలో నూరు పాయింట్లు సాధించాయి.
ఏ కేటగిరీలో ఏ రాష్ట్రం?
ఏ కేటగిరీలో ఏ రాష్ట్రం?
- ఆశావహులు(0–49 పాయింట్లు): లేవు
- క్రియాశీలురు (50–64 పాయింట్లు): మణిపూర్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, రాజస్తాన్, యూపీ, అసోం, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలు. దాద్రా నాగర్ హవేలీ, డయ్యూడామన్
- అగ్రశ్రేణి (65–99 పాయింట్లు): కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్ మిజోరాం, పంజాబ్, హరియాణ, త్రిపుర రాష్ట్రాలు. చంఢీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్
- సాధకులు (100 పాయింట్లు): ఏవీ లేవు
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీ: 2020–21 లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : జూన్ 3
ఎవరు : నీతి ఆయోగ్
ఎక్కడ : దేశంలోనే...
ఎందుకు : సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు...
Published date : 04 Jun 2021 08:31PM