సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు
Sakshi Education
సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్‌లు ఉన్నారని న్యాయశాఖ సెప్టెంబర్ 18న ప్రకటించింది.
దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 34కు చేరింది. ఇప్పటివరకూ ఇదే అత్యధిక సంఖ్య. ప్రస్తుతం జస్టిస్ రామసుమ్రమణియన్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ రాజస్తాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాను, జస్టిస్ కృష్ణ మురారి పంజాబ్, హరియాణా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. జస్టిస్ హృతికేశ్ రాయ్ కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా విధులు నిర్వర్తించారు.
సుప్రీంకోర్టు జడ్జీల గరిష్ట సంఖ్యను 31(30+1) నుంచి 34(33+1)కు పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ జూలై 31న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సుప్రీంకోర్టుకు కొత్తగా నలుగురు జడ్జీలు నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ ఎస్‌ఆర్ భట్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ హృతికేశ్‌రాయ్

Published date : 19 Sep 2019 05:29PM