Skip to main content

సుందర్ పిచాయ్‌కి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు-2019 లభించింది.
అమెరికా భారత వాణిజ్య మండలి(యూఎస్‌ఐబీసీ) ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డుకు పిచాయ్‌తోపాటు నాస్‌డాక్ అధ్యక్షుడు అడేనా ఫ్రైడ్‌మాన్ కూడా ఎంపికయ్యారు. జూన్ నెలలోనే జరగనున్న ‘ఇండియా ఐడియాస్’ సదస్సులో వారికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి ఇరు కంపెనీలు అందిస్తున్న సేవలకు గానూ వారిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు యూఎస్‌ఐబీసీ వెల్లడించింది. గూగుల్, నాస్‌డాక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150శాతం మేర వృద్ధి చెందినట్లు పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
యూఎస్‌ఐబీసీ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు-2019
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుందర్ పిచాయ్, అడేనా ఫ్రైడ్‌మాన్
ఎందుకు : సాంకేతిక రంగ అభివృద్ధికి అందిస్తున్న సేవలకు గానూ
Published date : 05 Jun 2019 05:55PM

Photo Stories