స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ ప్రాజెక్ట్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
Sakshi Education
స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్(ఎస్‌పీసీ) ప్రాజెక్ట్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉంది.
రాష్ట్రంలోని 558 పాఠశాలల్లో 1,10,661 మంది విద్యార్థులు ఈ ప్రాజెక్టులో ఉన్నారు. పోలీన్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ - బీపీఆర్‌డీ) రూపొందించిన ‘డేటా ఆన్ పోలీన్ ఆర్గనైజేషన్స్’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 2020 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ సంస్థలకు సంబంధించిన వివరాలతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం... ఎస్‌పీసీ ప్రాజెక్ట్‌లో ఏపీ, ఉత్తరప్రదేశ్, కేరళ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సీసీ కెమెరాల్లో తెలంగాణ మొదటిస్థానంలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్(ఎస్‌పీసీ) ప్రాజెక్ట్‌లోమొదటి స్థానలో ఉన్న రాష్ట్రం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్(ఎస్‌పీసీ) ప్రాజెక్ట్‌లోమొదటి స్థానలో ఉన్న రాష్ట్రం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎక్కడ : దేశంలో
Published date : 31 Dec 2020 11:48AM