Skip to main content

స్టాట్యూ ఆఫ్ పీస్‌ను ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు?

‘స్టాట్యూ ఆఫ్ పీస్’(శాంతి విగ్రహం)పేరుతో నిర్మించిన పఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ విగ్రహాన్ని సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగాప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020, నవంబర్ 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
Current Affairs
రాజస్తాన్ రాష్ట్రం, పాలీ జిల్లాలోని పాలీ పట్టణంలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. విగ్రహావిష్కరణ అనంతరం మోదీ మాట్లాడుతూ... జైన ఆచార్యుడు విజయ్ వల్లభ్ విద్య, మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.

చదవండి: స్టాట్యూ ఆఫ్ యూనిటీని ఎక్కడ నెలకొల్పారు? దీని ఖర్చు ఎంత? రూపకర్త ఎవరు? ఎవరి జయంతి సందర్భంగా ఆవిష్కరించారు?

వోకల్ ఫర్ లోకల్...
దీపావళి పండుగ సందర్భంగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసి, దేశీయ వ్యాపారులకు ఊతం ఇచ్చినట్లుగానే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు కొనసాగించాలని దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ (స్థానికానికి మద్దతుగా గళమెత్తాలి) అనే సందేశాన్ని దశదిశలా వ్యాపింపజేయాలని కోరారు.

నేషనల్ ప్రెస్ డే...
కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంచడంలో మీడియా ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నవంబర్ 16న నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశం ఇచ్చారు. ప్రతి ఏడాది మే 3వ తేదీని ఇంటర్నేషనల్ ప్రెస్ డేగా పాటిస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్టాట్యూ ఆఫ్ పీస్(శాంతి విగ్రహం) ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : పాలీ పట్టణం, పాలీ జిల్లా, రాజస్తాన్ రాష్ట్రం
ఎందుకు : ప్రఖ్యాత జైన మత బోధకుడు విజయ్ వల్లభ్ సురీశ్వర్ 151వ జయంతి సందర్భంగా...
Published date : 17 Nov 2020 05:14PM

Photo Stories