సరకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్ కలిగిన తొలి విమానాశ్రయం?
Sakshi Education
బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) ద్వారా సరుకు రవాణ సేవలను మరింత పెంచేందుకు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సరుకు రవాణా టెర్మినల్ ఏర్పాటైంది.
ఈ టెర్మినల్‌ను బెంగళూరు జోన్ కస్టమ్స్ విభాగ చీఫ్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ మార్చి 12న ప్రారంభించారు. దీంతో దేశంలో సరుకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్ కలిగి ఉన్న మొదటి విమానాశ్రయంగా కేఐఏ ఘనతకెక్కింది. కొత్త టెర్మినల్‌లో సరుకులను స్వీకరించేందుకు, పంపిణీ చేసేందుకు యాంత్రిక ట్రక్ డాక్‌లను ఏర్పాటు చేశారు.
తిరుపతిలో అత్యాధునిక ఆస్పత్రి...
తిరుపతిలో అత్యాధునిక వసతులతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ముంబైకి చెందిన దాత, ఉద్వేగ్ ఇన్‌న్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రయివేట్ లిమిటెడ్(యూ.ఐ.సీ) సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె.సింగ్ ఆధ్వర్యంలో రూ.300 కోట్లతో దీనిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సరకు రవాణాకు ప్రత్యేక టెర్మినల్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 12
ఎవరు : బెంగళూరు జోన్ కస్టమ్స్ విభాగ చీఫ్ కమిషనర్ ఎం.శ్రీనివాస్
ఎక్కడ : కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ), బెంగళూరు
ఎందుకు : సరుకు రవాణ సేవలను మరింత పెంచేందుకు

Published date : 13 Mar 2021 06:25PM