Skip to main content

Sania Mirza: క్లీవ్‌ల్యాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నిలో రన్నరప్‌గా నిలిచిన జంట?

క్లీవ్‌ల్యాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్‌)–క్రిస్టినా మెకేల్‌ (అమెరికా) జంట రన్నరప్‌ ట్రోఫీతో సంతృప్తి పడింది.
ఆగస్టు 29న అమెరికాలోని ఒహాయోలో జరిగిన ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్‌ సీడ్‌ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 6,000 డాలర్ల (రూ. 4 లక్షల 40 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

బెల్జియం జీపీ విజేత వెర్‌స్టాపెన్‌
వర్షంతో మూడు ల్యాప్‌లే జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్‌ రేసులో రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. బెల్జియంలోని స్పా ఫ్రాంకోర్‌చాంప్స్‌ సర్క్యూట్‌లో ఆగస్టు 29న జరిగిన ఈ రేసు నిలిచే సమయానికి వెర్‌స్టాపెన్, రసెల్‌ (విలియమ్స్‌), హామిల్టన్‌ (మెర్సిడెస్‌) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉండటంతో దానిని తుది ఫలితంగా ప్రకటించారు. తదుపరి డచ్‌ గ్రాండ్‌ప్రి సెప్టెంబర్‌ 5న జరగనుంది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : క్లీవ్‌ల్యాండ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నిలో రన్నరప్‌గా నిలిచిన జంట?
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : సానియా మీర్జా (భారత్‌)–క్రిస్టినా మెకేల్‌ (అమెరికా) జంట
ఎక్కడ : ఒహాయో, అమెరికా
ఎందుకు : ఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 5–7, 3–6తో టాప్‌ సీడ్‌ సుకో అయోమా–ఎనా షిబహారా (జపాన్‌) జోడీ చేతిలో ఓడిపోయినందున...
Published date : 30 Aug 2021 06:04PM

Photo Stories