స్మార్ట్ వ్యవస్థ పరీక్ష విజయవంతం
Sakshi Education
దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్‌సానిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది.
శత్రు దేశాల సబ్‌మెరైన్లను మెరుపు వేగంతో ధ్వంసం చేసే ఈ అత్యాధునిక టార్పెడో పరీక్షను ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఉన్న ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో అక్టోబర్ 5న నిర్వహించారు. ‘స్మార్ట్’తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. యాంటీ-సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి పేర్కొన్నారు.
రెండు ఆయుధ వ్యవస్థల అనుసంధానమే...
సూపర్ సోనిక్ క్షిపణులు, టార్పెడోలు.. ఈ రెండు ఆయుధ వ్యవస్థలను అనుసంధానం చేసి అత్యంత శక్తిమంతమైన టార్పెడోను రూపొందించారు. ఈ వ్యవస్థలో ఓ క్షిపణి తక్కువ బరువుండే టార్పెడోను మోసుకెళుతుంది. ఇది లక్ష్యానికి సమీపం వరకు గాలిలో అతి తక్కువ ఎత్తులో దూసుకెళ్లి, సబ్‌మెరైన్ దగ్గరకు వెళ్లగానే టార్పెడోను నీటిలోకి వదులుతుంది. తర్వాత క్షణాల్లో అది శత్రువుల సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేస్తుంది. టార్పెడో రేంజ్ కంటే ఎక్కువ దూరంలో ఉండే లక్ష్యాలను ఛేదించేందుకు ‘స్మార్ట్’ను రూపొందించారు. యుద్ధ నౌకలు, తీరంలోని ట్రక్‌ల నుంచి కూడా దీనిని ప్రయోగించవచ్చు.
600 కి.మీ.పైగా దూరం...
ప్రపంచంలో ఇప్పటి వరకు టార్పెడో ప్రయాణించే గరిష్ఠ దూరం సుమారు 50 కి.మీ. రాకెట్‌కు అనుసంధానించిన టార్పెడోలు 150 కి.మీ వరకు వెళతాయి. స్మార్ట్ విధానంలో 600 కి.మీ.పైగా టార్పెడో దూసుకెళుతుంది. క్షిపణులు మోసుకెళ్లే టార్పెడో వ్యవస్థలు అమెరికా, రష్యా, చైనా వద్ద కూడా ఉన్నాయి. అమెరికా ఉపయోగించే ఆస్‌రాక్ వ్యవస్థలో టార్పెడో 25 కి.మీపైగా దూరం ప్రయాణిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సూపర్‌సానిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్), భద్రక్ జిల్లా, ఒడిశా

ఎందుకు : దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు
Published date : 07 Oct 2020 05:47PM