Skip to main content

స్కిల్ డెవలప్‌మెంట్‌పై మూడు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేందుకు మూడు ప్రముఖ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది.
Edu news

అక్టోబర్ 22న స్కిల్  డెవలప్‌మెంట్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డెల్ టెక్నాలజీస్, జేబీఎం ఆటో లిమిటెడ్, సీఐఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ ప్రతినిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా మధుసూదనరెడ్డి ఉన్నారు. ఒప్పందంలో భాగంగా...

  1.   డెల్ టెక్నాలజీస్ సంస్థ విశాఖ జిల్లా ఐటీ సెక్టార్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్‌‌సను ఏర్పాటు చేయనుంది. డేటా సైన్‌‌స, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల కోసం వర్చువల్ కోర్సులను అందించనుంది.
  2.   ఆటోమోటివ్ రంగానికి సంబంధించిన కోర్సుల్లో జేబీఎం శిక్షణ ఇవ్వనుంది. శ్రీసిటీలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 
  3.   సీఐఐ ఇన్‌స్టిట్యూట్ లాజిస్టిక్స్ రంగంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది.

క్విక్ రివ్యూ   :

 ఏమిటి    : డెల్ టెక్నాలజీస్, జేబీఎం ఆటో లిమిటెడ్, సీఐఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ కంపెనీలతో ఒప్పందం

 ఎప్పుడు        : అక్టోబర్ 22

 ఎవరు        : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 

ఎందుకు    : స్కిల్ కాలేజీల్లో శిక్షణ ఇచ్చేందుకు

Published date : 23 Oct 2020 06:36PM

Photo Stories