సీబీఐ మాజీ డెరైక్టర్ అలోక్ పదవీ విరమణ
Sakshi Education
సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ డెరైక్టర్ అలోక్ కూమార్ వర్మ జనవరి 11న ప్రభుత్వ సర్వీసుల నుంచి రాజీనామా చేశారు.
తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలోక్ తెలిపారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ అలోక్ వర్మను సీబీఐ డెరైక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ మాజీ డెరైక్టర్ పదవీ విరమణ
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : అలోక్ కుమార్ వర్మ
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీబీఐ మాజీ డెరైక్టర్ పదవీ విరమణ
ఎప్పుడు : జనవరి 11
ఎవరు : అలోక్ కుమార్ వర్మ
Published date : 12 Jan 2019 06:14PM