సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ
Sakshi Education
గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు కొత్త శాఖ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి డిసెంబర్ 11న అంగీకారం తెలిపింది.
గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలమైన యంత్రాంగం ఏర్పాటు చేయడమే దీని ఉద్దేశం. లక్ష్యాల సాధనకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకునేలా కార్యాచరణ ఉంటుంది. ఉద్యోగులను సమర్ధంగా వినియోగించుకోవడంతోపాటు లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, మెరుగైన భాగస్వామ్యంతో మంచి ఫలితాలు రాబడతారు.
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు
కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు
- ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్త చట్టం ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం. ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్టీసీ విలీనం కోసం పబ్లిక్ ట్రాన్‌సపోర్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటుకు మంత్రిమండలి అంగీకరించింది.
- అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిచేస్తూ మంత్రివర్గం నిర్ణయించింది.
- ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్‌స కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం. రూ.101 కోట్ల షేర్ క్యాపిటల్‌తో ఏర్పాటు.
- ఆంధ్రప్రదేశ్ మిల్లెట్ బోర్డు చట్టం-2019 ముసాయిదాకు బిల్లుకు గ్రీన్‌సిగ్నల్. కరవు, వర్షాభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు ముసాయిదా బిల్లు.
- ఆంధ్రప్రదేశ్ పప్పుధాన్యాల బోర్డు చట్టం - 2019 బిల్లుకు ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు కేబినెట్ అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22 వేల కోట్లు.
- ఆంధ్రప్రదేశ్ గూడ్‌స అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి పచ్చజెండా
క్విక్ రివ్యూ :
ఏమిటి : సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయాల నిర్వహణకు
Published date : 12 Dec 2019 07:06PM