సభ్య దేశాలకు ఏడీబీ 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
Sakshi Education
సంక్షోభ సమయంలో ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) భారీ ప్యాకేజీని ప్రకటించింది.
కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకుగాను సభ్య దేశాలకు 20 బిలియన్ డాలర్ల (1.52 లక్షల కోట్లు సుమారు) సాయాన్ని అందించనుంది. నెల రోజుల క్రితం ప్రకటించిన ప్యాకేజీ కంటే ఇది మూడు రెట్లు అధికం. మార్చి 18న 6.5 బిలియన్ డాలర్లు (రూ.49 వేల కోట్లు) ఇవ్వాలని ప్రతిపాదించగా, పరిస్థితి తీవ్రత దృష్ట్యా దానిని మూడింతలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాల్లో లౌక్‌డౌన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. సంక్షోభ తీవ్రత నేపథ్యంలో సాయాన్ని ఏడీబీ పెంచుతున్నట్టు బ్యాంకు ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా ఏప్రిల్ 13న తన ప్రకటనలో తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సభ్య దేశాలకు 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకుగాను
క్విక్ రివ్యూ :
ఏమిటి : సభ్య దేశాలకు 20 బిలియన్ డాలర్ల ప్యాకేజీ
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ప్రతికూలతలను అధిగమించేందుకుగాను
Published date : 14 Apr 2020 06:25PM