సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
Sakshi Education
నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది.
నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైనర్లకు మరణశిక్ష రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : సౌదీ అరేబియా ప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : మైనర్లకు మరణశిక్ష రద్దు
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : సౌదీ అరేబియా ప్రభుత్వం
Published date : 28 Apr 2020 06:45PM