Skip to main content

సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం

హైదరాబాద్ నగరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభమైంది. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్(రిచ్) ఆధ్వర్యంలో నడిచే ఈ క్టస్టర్‌ను జనవరి 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
Current Affairs
వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో రాష్ట్రంలో 5 పెద్ద కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా సంపదతోపాటు లక్ష ఉద్యోగాలు సృష్టించడంపై దృష్టి సారించామని మంత్రి పేర్కొన్నారు.

పీఎం స్టియాక్...
దేశంలో శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఉద్దేశంతో ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణల సలహామండలి(పీఎం స్టియాక్) నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్న నాలుగు నగరాల్లో ఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, పుణే ఈ జాబితాలో ఉన్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 9
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : శాస్త్ర పరిశోధన, ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు
Published date : 09 Jan 2021 05:57PM

Photo Stories