Skip to main content

సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన

కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్-2019, యువ పురస్కార్-2019లను ప్రకటించింది.
త్రిపుర రాజధాని అగర్తలలో జూన్ 14న అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్ర శేఖర కంబారా అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించి 22 మంది రచయితలను బాల సాహిత్య పురస్కారాలకు, 23 మందిని యువ పురస్కారాలకు ఎంపిక చేసింది.

ఇద్దరు తెలుగు కవులకు...
కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డులకు ఇద్దరు తెలుగు కవులు ఎంపికయ్యారు. తెలుగు భాషలో బాల సాహిత్య పురస్కార్-2019కు రచయిత బెలగం భీమేశ్వరరావు ఎంపికయ్యారు. ఆయన రచన ‘తాత మాట వరాల మూట’ చిన్న కథలు పుస్తకానికి గాను ఈ పురస్కారం దక్కింది. బాల సాహిత్యానికి విశేష సేవలు అందించే రచయితకే ఈ పురస్కారం అందజేస్తారు. 35 ఏళ్ల లోపు రచయితలకు ఇచ్చే సాహిత్య అకాడమీ యువ పురస్కార్-2019కు గడ్డం మోహన్‌రావు ఎంపికయ్యారు. ఆయన రచించిన ‘కొంగవాలు కత్తి’ నవల అవార్డుకు ఎంపికైంది. విజేతలకు తామ్ర పత్రంతో పాటు రూ.50 వేల నగదును ప్రదానం చేస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బాల సాహిత్య పురస్కార్-2019, యువ పురస్కార్-2019 ప్రకటన
ఎప్పుడు : జూన్ 14
ఎవరు : కేంద్ర సాహిత్య అకాడమీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్ర శేఖర కంబారా
ఎక్కడ : అగర్తల, త్రిపుర
Published date : 15 Jun 2019 06:14PM

Photo Stories