రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధి
Sakshi Education
వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ‘వ్యవసాయ మౌలిక నిధి’ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
పీఎం కిసాన్ నిధుల విడుదల
పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.17 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ ఆరో విడత నిధుల విడుదల ద్వారా రైతు ఖాతాలో నేరుగా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ అయిందని ప్రధాని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన తర్వాత 10 వేల కోట్ల మందికిపైగా రైతులకు 90 వేల కోట్ల వరకు నిధులు అందాయి.
వ్యవసాయ మౌలిక నిధి-వివరాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి :రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధి ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు:వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం
రైతులకు అత్యంత పవిత్రదినమైన బలరామ్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నిధిని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా పాల్గొన్నారు. ఈ నిధి ద్వారా రుణాలు అందించడానికి ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలుత రైతులకు దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేశారు.
ప్రధాని ప్రసంగం-వివరాలు
ప్రధాని ప్రసంగం-వివరాలు
- చిన్న రైతుల సాధికారతే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగంలో భారీగా సంస్కరణలు తీసుకువస్తున్నాం.
- వ్యవసాయంలో దిగుబడులు పెంచడంలో ఇబ్బందుల్ని అధిగమించామని, పండిన పంటల్ని కాపాడుకోవడంలో ఎదురయ్యే సమస్యల్ని ఈ నిధి తీరుస్తుంది.
- ఈ నిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంలో ఆధునిక సౌకర్యాల కల్పన జరిగేలా పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుంది.
- ఒకే దేశం, ఒకే మండీ విధానం ద్వారా రైతులు పండిన పంటల్ని ఎక్కడైనా అమ్ముకునే వీలు కల్పిస్తున్నాం.
పీఎం కిసాన్ నిధుల విడుదల
పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ.17 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ ఆరో విడత నిధుల విడుదల ద్వారా రైతు ఖాతాలో నేరుగా రూ.2 వేల చొప్పున నగదు బదిలీ అయిందని ప్రధాని చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ప్రతీ ఏడాది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ప్రారంభించిన తర్వాత 10 వేల కోట్ల మందికిపైగా రైతులకు 90 వేల కోట్ల వరకు నిధులు అందాయి.
వ్యవసాయ మౌలిక నిధి-వివరాలు
- పండిన పంటను నిల్వ చేసుకునే సామర్థ్యం లేక రైతులు పంటల్ని రోడ్ల మీద పారబోసే దృశ్యాలను మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. అలాంటి వృథాని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేసింది.
- ఈ నిధితో రైతులు సొంతంగా తమ గ్రామాల్లోనే పంటల్ని నిల్వ చేసుకోవడానికి ఆధునిక సదుపాయాలను కల్పించుకోవడానికి వీలు కలుగుతుంది.
- గ్రామాల్లోనే పంట సేకరణ కేంద్రాలు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు వ్యవసాయం పండుగలా మారుతుంది. అంతేకాదు వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది.
- మొత్తం 10 వేల ఆహార శుద్ధి కేంద్రాలు, 350అగ్రీ స్టార్టప్‌ల ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
- పంట దిగుబడుల్ని కాపాడుకుంటే మంచి ధర వచ్చేవరకువేచి చూసే అవకాశం కూడా రైతులకు ఈ నిధి ద్వారా లభిస్తుంది.
- రైతు సంఘాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, అగ్రీ స్టార్టప్‌లు వంటి వారందరికీ ఈ నిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. మూడు శాతం వడ్డీ రాయితీ, రెండు కోట్ల రూపాయల వరకు క్రెడిట్ గ్యారంటీ ఈ నిధి ద్వారా రైతులకు లభిస్తుంది. మొత్తం నాలుగేళ్ల పాటు రుణాలు మంజూరు చేస్తారు.
- 2020 ఏడాది 10వేల కోట్లు, వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల్లో 30 వేల కోట్ల రూపాయల చొప్పున రుణాలు పంపిణీ చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధి ప్రారంభం
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు:వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం
Published date : 10 Aug 2020 05:58PM