Skip to main content

రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన

పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని అక్టోబర్ 12న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Edu news

 ఇందులో ఎల్‌టీసీ, శాలరీ అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్‌‌స, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రాష్ట్రాలకు కేటారుుంచారు.

ఎల్‌టీసీ క్యాష్ ఓచర్లు-వివరాలు

  1.  సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
  2.  ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్‌టీసీ) స్థానంలో ఈ ఏడాది క్యాష్ ఓచర్లను ఇస్తారు.
  3.  శాలరీ అడ్వాన్‌‌స, ఎల్‌టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్ ఉంటుందని అంచనా.
  4.  ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి.
  5.  ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్ ను అందించనున్నారు. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి.
  6.  ఎల్‌టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు  రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుంది.
Published date : 13 Oct 2020 07:15PM

Photo Stories