Skip to main content

రసాయనాల రహిత శానిటైజర్ రూపకల్పన

రసాయనాలు లేని నూతన శానిటైజర్‌ను సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి.
Current Affairsఈ విషయాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మార్చి 18న వెల్లడించింది. ఈ శానిటైజర్‌లో సహజసిద్ధ రంగులు, టీలోని క్రియాశీలక ధాతువులు, ఆల్కాహాల్ మిశ్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఉపయోగించినట్లు ఐహెచ్‌బీటీ డెరైక్టర్ సంజయ్ కుమార్ వివరించారు.

నిత్యావసరాలుగా మాస్క్‌లు, శానిటైజర్లు
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నిత్యావసరాలైన సబ్బులు, నేలలు తుడిచే క్లీనర్లు, థర్మల్ స్కానర్ల ధరలను కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. సాధారణంగా ఈ శాఖ దేశవ్యాప్తంగా 22 నిత్యావసరాల ధరలను పర్యవేక్షిస్తుంటుంది. తాజాగా ఫేస్ మాస్క్‌లు, చేతి శానిటైజర్లను ఆ జాబితాలో చేర్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రసాయనాల రహిత శానిటైజర్ రూపకల్పన
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : సీఎస్‌ఐఆర్-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ) సంస్థలు
Published date : 19 Mar 2020 05:41PM

Photo Stories