Skip to main content

రంగస్థల నటుడు బుర్రా కన్నుమూత

ప్రముఖ రంగస్థల నటులు, కవి, కావ్యరచయిత, వెండితెర, బుల్లితెరలపై సుపరిచితులయిన కళాకారుడు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83) హైదరాబాద్‌లో ఏప్రిల్ 7న కన్నుమూశారు.
1936, ఫిబ్రవరి 9న కృష్ణాజిల్లా దివి తాలుకా కోడూరులో బుర్రా పద్మనాభ సోమయాజులు, సీతామహాలక్ష్మి దంపతులకు జన్మించిన ఆయన కళా రంగంలో విశేష కృషి చేశారు. ఉత్తమ స్త్రీ పాత్రలైన సత్యభామ, చింతామణి, సక్కుబాయి, చంద్రమతి, మోహిని, మాధురి వంటి పాత్రల్లో పాత్రల్లో నటించి ‘చింతామణి శాస్త్రి’గా గుర్తింపు పొందారు.

1970వ దశకంలో వీరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘నాలాగా ఎందరో’అనే సినిమా ద్వారా సుబ్రహ్మణ్య శాస్త్రి వెండితెరకు పరిచయం అయ్యారు. సత్యసాయిబాబా నాటక సమాజాన్ని స్థాపించి అనేక ప్రదర్శనలను ఇచ్చిన ఆయన శిఖరం, పుత్తడిబొమ్మ, ఆడదే ఆధారం, రుద్రపీఠం సీరియళ్లలో నటించారు. ఈయన దర్శకత్వం వహించిన ‘కృష్ణాతీరం’అనే సీరియల్‌కు నంది అవార్డు వచ్చింది. మరోవైపు కవిగా వాల్మీకి రామాయణం, అష్టావిధ శృంగార నాయికలు(కావ్యం), త్యాగయ్య(నాటకం) వంటి వాటిని రచించారు. దేవీ భాగవతం, హనుమత్‌చరిత్ర ప్రవచాలను కూడా ఆయన చెప్పేవారు. నాట్యాచార్య, అభినయ సరస్వతి, నాట్య మయూరిలాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రముఖ రంగస్థల నటులు, కవి కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి (83)
ఎక్కడ : హైదరాబాద్
Published date : 09 Apr 2019 05:15PM

Photo Stories