Skip to main content

రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం

రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్(గ్రామీణం) ప్రారంభమైంది.
Current Affairsజలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మిషన్‌ను ప్రారంభించారు. రూ.1,40,881 కోట్లతో చేపట్టిన రెండో దశ మిషన్‌ను 2020-21 నుంచి 2024-25 మధ్య అమలు చేస్తారు. రెండో దశ మిషన్ ద్వారా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపడతారు. ‘గత ఐదేళ్లలో మొదటి దశ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా టాయిలెట్ల నిర్వహణ, వాడకంలో సాధించిన లక్ష్యాలపై రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ దృష్టి సారిస్తుంది’అని మంత్రి షెకావత్ తెలిపారు.

ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ. 446 కోట్లు
గత ఐదేళ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు రూ. 446.52 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ మార్చి 4న తెలిపింది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు 2015-16లో రూ. 121.85 కోట్లు, 2016-17లో రూ. 78.52 కోట్లు, 2017-18లో రూ. 99.90 కోట్లు ఖర్చయింది. అలాగే 2018-19లో 100.02 కోట్లు, 2019-20లో 46.23 కోట్లు ఖర్చు చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రెండో దశ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను చేపట్టేందుకు
Published date : 05 Mar 2020 05:59PM

Photo Stories