Skip to main content

రాయిటర్స్ జర్నలిస్టులు విడుదల

ప్రభుత్వ రహస్యాల చట్టాల్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో మయన్మార్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన రాయిటర్స్ జర్నలిస్టులు వా లోన్, క్యావ్ సో వూ మే 7న విడుదలయ్యారు.
రాష్ట్రపతి క్షమాభిక్ష కింద వీరిద్దరినీ విడుదల చేస్తున్నట్లు మయన్మార్ ప్రభుత్వం తెలిపింది. రోహింగ్యాలపై జరుగుతున్న అరాచకంపై వార్తలు రాసినందుకు 2017లో వీరిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. దీంతో 500 రోజుల అనంతరం వీరిని విడుదల చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాయిటర్స్ జర్నలిస్టులు విడుదల
ఎప్పుడు : మే 7
ఎవరు : వా లోన్, క్యావ్ సో వూ
ఎక్కడ : మయన్మార్
Published date : 08 May 2019 05:58PM

Photo Stories