Skip to main content

రాజేంద్రసింగ్‌కు తెలంగాణ జాగృతి పురస్కారం

సామాజిక సేవారంగంలో విశిష్ట సేవలందించిన వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్‌కు తెలంగాణ జాగృతి జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది.
హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ సదస్సు సందర్భంగా జనవరి 20న ఈ అవార్డును ప్రదానం చేశారు. గతంలో రామన్‌మెగసెసే అవార్డును కూడా రాజేంద్రసింగ్ అందుకున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ... ఈ సదస్సులో 110 దేశాలకు చెందిన 550 మంది ప్రతినిధులు పాల్గొన్నారని చెప్పారు. ఐక్యరాజ్యసమితి 2015లో పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై యువతకు అవగాహన కల్పించామన్నారు. ఇక నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తామని, జాగృతి సంస్థ యువశక్తితో గ్లోబల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ జాగృతి జీవితకాల సాఫల్య పురస్కారం
ఎప్పుడు : జనవరి 20
ఎవరు : రాజేంద్రసింగ్
ఎక్కడ : హైదరాబాద్
Published date : 21 Jan 2019 06:29PM

Photo Stories