ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి?
Sakshi Education
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా తొలిసారి చాంపియన్‌గా నిలిచింది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జూన్ 12న జరిగిన ఫైనల్లో ప్రపంచ 33వ ర్యాంకర్, అన్‌సీడెడ్ క్రిచికోవా 6–1, 2–6, 6–4తో ప్రపంచ 32వ ర్యాంకర్, 31వ సీడ్ అనస్తాసియా పావ్లుచెంకోవా (రష్యా)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. విజేత క్రిచికోవాకు 14 లక్షల యూరోలు (రూ. 12 కోట్ల 41 లక్షలు)... రన్నరప్ పావ్లుచెంకోవాకు 7 లక్షల 50 వేల యూరోలు (రూ. 6 కోట్ల 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
మహిళల డబుల్స్ టైటిల్ కూడా...
ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన 25 ఏళ్ల క్రిచికోవా జూన్ 13న మహిళల డబుల్స్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఫైనల్లో క్రిచికోవా –కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం 6–4, 6–2తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) –ఇగా స్వియాటెక్ (పోలాండ్) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన క్రిచికోవా జంటకు 2,44,925 యూరోలు (రూ. 2 కోట్ల 17 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఏడో క్రీడాకారిణిగా గుర్తింపు...
మహిళల డబుల్స్ ఫైనల్లో సినియకోవాతో కలిసి విజేతగా నిలిచిన క్రిచికోవా... 2000లో మేరీ పియర్స్ (ఫ్రాన్స్) తర్వాత ఒకే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ తరహా ఘనత సాధించిన ఏడో క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. గతంలో బిల్లీ జీన్ కింగ్ (1972), మార్గరెట్ కోర్ట్ (1973), క్రిస్ ఎవర్ట్ (1974, 1975), వర్జీనియా(1978), మార్టినా నవ్రతిలోవా (1982, 1984), మేరీ పియర్స్ (2000) ఈ ఘనత సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి?
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి బర్బోర క్రిచికోవా
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్

Published date : 15 Jun 2021 08:14PM