Skip to main content

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో టైటిల్ విజేత?

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ విభాగంలో పోలండ్‌కి చెందిన ఇగా స్వియాటెక్ చాంపియన్‌గా నిలిచింది.
Edu newsఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో అక్టోబర్ 10న గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 6-4, 6-1 తేడాతో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన 19 ఏళ్ల స్వియాటెక్‌కు 16 లక్షల యూరోలు (సుమారు రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన కెనిన్‌కు 8 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ టోర్నీకి ముందు 54వ ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన స్వియాటెక్ తాజా ప్రపంచ ర్యాంకిం‌గ్స్ లో 17వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

స్వియాటెక్ ఘనతలివీ...
  • పోలండ్ తరఫున గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి మహిళ
  • అన్‌సీడెడ్‌గా దిగి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో మహిళ.
  • మోనికా సెలెస్ (18 ఏళ్ల 187) రోజుల తర్వాత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన (19 ఏళ్ల 132 రోజులు) మహిళ.
  • గత 40 ఏళ్లలో పురుషుల, మహిళల విభాగాల్లో కెరీర్‌లో తొలి టైటిల్‌గా గ్రాండ్‌స్లామ్‌ను గెలిచిన నాలుగో క్రీడాకారిణి
  • 1975 తర్వాత ఇంత తక్కువ ర్యాంక్ (54) ఉన్న క్రీడాకారిణి ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం ఇదే మొదటిసారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఇగా స్వియాటెక్
ఎక్కడ : పారిస్, ఫ్రాన్స్
Published date : 12 Oct 2020 06:24PM

Photo Stories