Skip to main content

ఫిక్కీ నూతన ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?

2020-21 సంవత్సరానికిగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రెసిడెంట్‌గా డిసెంబర్ 14న ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు.
Current Affairs
ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సంగీతా రెడ్డి స్థానంలో ఉదయ్ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు పిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హిందుస్తాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోస్ ఎండీ సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు.

ప్రస్తుతం...
ప్రస్తుతం ఉదయ్ శంకర్ ది వాల్ట్ డిస్నీ కంపెనీకి ఏషియా పసిఫిక్ ప్రెసిడెంట్‌గా, స్టార్ అండ్ డిస్నీ ఇండియాకు చైర్మన్‌గా ఉన్నారు. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ కావటం ఫిక్కీ చరిత్రలోనే తొలిసారి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఉదయ్ శంకర్
Published date : 15 Dec 2020 05:57PM

Photo Stories