ఫిబ్రవరి 15న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
Sakshi Education
దేశీయ తొలి ఇంజిన్ రహిత రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ను న్యూఢిల్లీలో ఫిబ్రవరి 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలును తొలుత ‘ట్రైన్18’గా పిలిచారు. ఇటీవల కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’గా దీనికి నామకరణం చేశారు.16 బోగీలు ఉన్న ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలుగా పేరున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ-వారణాసి మధ్య ఇది రాకపోకలు సాగించనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 15
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 08 Feb 2019 05:58PM