Skip to main content

ఫార్ములావన్ 2020-సీజన్ చాంపియన్?

ఫార్ములావన్ (ఎఫ్1) 2020-సీజన్ ముగింపు రేసు ‘అబుదాబి గ్రాండ్‌ప్రి’లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు.
Current Affairs
యూఏఈ రాజధాని అబుదాబిలో యాస్ మరీనా సర్క్యూట్‌లో డిసెంబర్ 13న జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు బొటాస్ రెండో స్థానంలో... హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. కరోనా కారణంగా ఈ సీజన్‌లో 22 రేసులకు బదులుగా 17 రేసులను మాత్రమే నిర్వహించారు.

హామిల్టన్‌కు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్...
ఎఫ్1 2020-సీజన్‌లో 11 రేసుల్లో గెలుపొందిన హామిల్టన్ (మెర్సిడెస్) 347 పాయింట్లతో ఓవరాల్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను ఏడోసారి సొంతం చేసుకొని దిగ్గజ డ్రైవర్ మైకేల్ షుమాకర్ (జర్మనీ) రికార్డును సమం చేశాడు. బొటాస్, వెర్‌స్టాపెన్ రెండేసి రేసుల్లో నెగ్గగా... పెరెజ్, పియరీగ్యాస్లీ ఒక్కో రేసులో గెలిచారు. 573 పాయింట్లతో టీమ్ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ కూడా మెర్సిడెస్ జట్టుకే లభించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అబుదాబి గ్రాండ్‌ప్రి-2020 చాంపియన్
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్
ఎక్కడ : అబుదాబి, యూఏఈ
Published date : 14 Dec 2020 05:48PM

Photo Stories