పవర్ గ్రిడ్ ఇండియాకు సీఎస్‌ఆర్ అవార్డు
Sakshi Education
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది.
న్యూఢిల్లీలో అక్టోబర్ 29న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంస్థ చైర్మన్, ఎండీ కందికుప్ప శ్రీకాంత్ అవార్డు అందుకున్నారు. సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) ఎక్స్‌లెన్స్ అవార్డు విజేత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సామాజిక బాధ్యత కింద రూ.100 కోట్లకుపైగా వెచ్చించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో సమీకృత నీటి నిర్వహణ వ్యవస్థల ఏర్పాటుకు చేసిన కృషికి గుర్తింపుగా
Published date : 30 Oct 2019 05:31PM