పట్టిసీమ ప్రాజెక్టును ఆపేయండి : ఎన్జీటీ
Sakshi Education
గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగస్టు 13న ఆదేశించింది.
పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతనే ఆయా ప్రాజెక్టులను తిరిగి కొనసాగించాలని స్పష్టం చేసింది. గోదావరి, పెన్నా నదులపై ఎక్కువగా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటోందని మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, త్రినాథ్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆదేశం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : గోదావరి-పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులను ఆపేయాలని ఆదేశం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)
Published date : 13 Aug 2019 05:29PM