ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా ఎవరు ఉన్నారు?
Sakshi Education
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మొదటి సారిగా ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ <b>‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’</b> అత్యవసర వినియోగానికి జనవరి 1న అనుమతినిచ్చింది.
ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్‌తో పాటు డజనుకు పైగా దేశాలు ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే డబ్ల్యూహెచ్‌ఒ అనుమతులు ఇవ్వడంతో నిరుపేద దేశాలకు కూడా ఫైజర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో డెరైక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ ఉన్నారు.
సాధారణంగా... ఏ దేశానికి ఆ దేశమే వ్యాక్సిన్ వినియోగంపై నిర్ణయం తీసుకుంటాయి. కానీ వ్యవస్థలు బలహీనంగా ఉన్న దేశాలు మాత్రం డబ్ల్యూహెచ్‌వో అనుమతించాక మాత్రమే టీకా పంపిణీ చేపడతాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంది.
Published date : 02 Jan 2021 05:49PM