ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరు?
Sakshi Education
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌ను రెండో స్థానానికి నెట్టారు. జనవరి 7న విడుదలైన బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ‘‘ప్రపంచంలోనే 500 మంది అత్యంత సంపన్నుల జాబితా’’లో ఈ విషయం వెల్లడైంది. బ్లూమ్‌బర్గ్ నివేదిక బట్టి జనవరి 7న టెస్లా షేర్ల ధర ప్రకారం ఎలాన్ మస్క్ సంపద విలువ 188.5 బిలియన్ డాలర్ల పైగా ఉంది. బెజోస్ సంపదతో పోలిస్తే ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. జనవరి 7న టెస్లా షేరు మరో 7 శాతం ఎగిసి 811.61 డాలర్ల రికార్డు స్థాయిని తాకడంతో ఇది సాధ్యపడింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత ధనవంతుడిగా గుర్తింపు
ఎప్పుడు : జనవరి 7
ఎవరు : టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 08 Jan 2021 06:38PM