ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్?
Sakshi Education
ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్ తన స్థానాన్ని కొనసాగిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : బ్రాండ్ ఫైనాన్స్-2021
ఎక్కడ : ప్రపంచంలో
యాక్సెంచర్ తర్వాత ఐబీఎం కంపెనీ రెండో స్థానంలో, భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్) మూడో స్థానంలో నిలిచాయి. జనవరి 27న విడుదలైన బ్రాండ్ ఫైనాన్స్-2021 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- యాక్సెంచర్ బ్రాండ్ వాల్యూ 26 బిలియన్ డాలర్లుగా, ఐబీఎం బ్రాండ్ విలువ 16.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
- టీసీఎస్ బ్రాండ్ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్ డాలర్లు ఎగసి 14.9 బిలియన్ డాలర్లకు చేరింది.
- నాలుగో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
- జాబితాలో హెచ్‌సీఎల్-7, విప్రో-9, టెక్ మహీంద్రా-15వ స్థానానికి చేరాయి.
- మొత్తంగా టాప్-10లో భారత్ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్ బ్రాండ్‌గా యాక్సెంచర్
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : బ్రాండ్ ఫైనాన్స్-2021
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 29 Jan 2021 04:51PM