Skip to main content

ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు

ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు సెప్టెంబర్ 8న వర్చువల్‌గా జరిగింది. అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్‌ఏ) నిర్వహించిన ఈ సదస్సులో దాదాపు 149 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Current Affairs

చౌకై న, సుస్థిరమైన శుద్ధ ఇంధనాలను వేగవంతం చేయడంపై, సోలార్ విద్యుత్తులో తదుపరి తరం టెక్నాలజీలను ఆవిష్కరించడంపై ఈ సదస్సు దృష్టి సారించింది. ఐఎస్‌ఏ అసెంబ్లీ ప్రెసిడెంట్‌గా కేంద్ర పునురుత్పాదక ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్ వ్యవహరించారు. ఆయనతోపాటు, సహ ప్రె సిడెంట్‌గా ఉన్న ఫ్రాన్స్ మంత్రి బార్బరా పొంపిలి, ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లేటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల తరఫున ఐఎస్‌ఏ ఉపాధ్యక్షులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో ప్రధాని మోదీ సందేశాన్ని పునరుత్పాదక ఇంధన శాఖా మంత్రి ఆర్కే సింగ్ చదివి వినిపించారు.

మోదీ సందేశం...

  • భారత్ పర్యావరణ అనుకూల ఇంధన విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతమున్న 134 గిగావాట్ల నుంచి 2022 నాటికి 220 గిగావాట్లకు పెంచుకుంటుంది.
  • సోలార్ ఇంధన వినియోగాన్ని పెంచుకునే విషయంలో సాంకేతిక పురోగతి ద్వారా టారిఫ్‌లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది.
  • శుద్ధ ఇంధనాలను దేశాల మధ్య సరఫరాకు ‘ఒకే ప్రపంచం, ఒకటే సూర్యుడు, ఒకటే గ్రిడ్‌‘ అనే నినాదాన్ని మోదీ ఇచ్చారు.


చదవండి: అంతర్జాతీయ సౌర కూటమి వ్యవస్థాపక సదస్సు ఎప్పుడు, ఏ నగరంలో జరిగింది?

క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ తొలి సోలార్ టెక్నాలజీ సదస్సు నిర్వహణ
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్‌ఏ)
ఎక్కడ : ఆన్‌లైన్

Published date : 09 Sep 2020 05:50PM

Photo Stories