ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి
Sakshi Education
ప్రాణాంతక వ్యాధి అయిన తట్టు(మిజిల్స్)ను ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఏప్రిల్ 19న ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది.
పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలతోపాటు.. అమెరికాలోనూ ఈ వ్యాధి దాఖలాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధితో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని యునెటైడ్ నేషన్స్ చిల్డన్ర్‌స ఫండ్ (యునిసెఫ్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించాయి. తట్టు కారణంగా ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతున్నారని తెలిపాయి. కాంగో, ఇథియోఫియా, జార్జియా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, మడగాస్కర్, మయన్మార్, ఫిలిప్పీన్స్, సూడాన్‌లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఐక్యరాజ్య సమితి (ఐరాస)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఐక్యరాజ్య సమితి (ఐరాస)
Published date : 20 Apr 2019 05:31PM