ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారత జీఎం?
Sakshi Education
భారత గ్రాండ్ మాస్టర్ (జీఎం) పి.ఇనియన్ ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నమెంట్ చాంపియన్‌గా నిలిచాడు.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 3న టోర్నీ నిర్వాహకులు వెల్లడించారు. దీంతో ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారత జీఎంగా ఇనియన్ ఖ్యాతికెక్కాడు. 2020, ఆగస్టు 7 నుంచి 9 మధ్య క్లాసికల్ టైమ్ కంట్రోల్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగినా... ఫెయిర్ ప్లే నిబంధనలను పరీశిలించిన అనంతరం నిర్వాహకులు సెప్టెంబర్ 3న విజేతను ప్రకటించారు.
టై బ్రేక్ ఉండటంతో...
కరోనా వల్ల ఆన్‌లైన్‌లో 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో ఆరు విజయాలు, మూడు ‘డ్రా’లు నమోదు చేసిన 17 ఏళ్ల ఇనియన్... 7.5 పాయింట్లతో రష్యా జీఎం స్జుగిరో సనన్‌తో పాటు సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన ‘టై బ్రేక్’ ఉండటంతో ఇనియన్‌కు టైటిల్ సొంతమైంది. మొత్తం ఈ టోర్నీలో 16 దేశాలకు చెందిన 120 మంది చెస్ ప్లేయర్లు పాల్గొనగా... అందులో 30 మంది జీఎంలు ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ ఓపెన్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన తొలి భారత జీఎం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : పి.ఇనియన్

Published date : 04 Sep 2020 05:31PM