Skip to main content

ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో భారత్ నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ నవంబర్ 19న విడుదల చేసిన ‘ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

గ్లోబల్ సిటీ ఇండెక్స్-ముఖ్యాంశాలు
  • 2019 ఏడాది మూడో త్రైమాసికానికి రూపొందించిన ఈ నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది.
  • గత ఏడాది కాలంలో మాస్కోలో గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి.
  • ఫ్రాంక్‌ఫర్ట్ రెండో స్థానంలో (ధరల్లో వృద్ధి 10.3 శాతం) నిలవగా.. తైపీ (8.9 శాతం) మూడో ర్యాంకు పొందింది.
  • సియోల్‌కు జాబితాలో ఆఖరి ర్యాంకు లభించింది. ఈ నగరంలో ఖరీదైన గృహాల ధరలు 12.9 శాతం పడిపోయాయి.
  • రెండో త్రైమాసికంతో పోలిస్తే దిల్లీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 9వ స్థానానికి ఎగబాకింది.ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గృహాల ధరలు మూడో త్రైమాసికంలో సగటున 4.4 శాతం మేర పెరిగాయి.
  • బెంగళూరు ర్యాంకు 15 నుంచి 5 స్థానాలు తగ్గి 20కి దిగివచ్చింది.
  • ముంబయి 30వ స్థానం నుంచి రెండు స్థానాలు పెంచుకొని 28వ స్థానంలో నిలిచింది.
  • స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా గ్లోబల్ సిటీ  ఇండెక్స్‌లో ర్యాంక్‌లను కేటాయిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచ లగ్జరీ మార్కెట్లో ఢిల్లీకి 9వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : నైట్ ఫ్రాంక్-ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2019
Published date : 20 Nov 2019 04:41PM

Photo Stories