Skip to main content

ప్రముఖ శాస్త్రవేత్త చిరంజీవికి ఫిక్కి అవార్డు

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఎఫ్‌ఐసీసీఐ) అవార్డు లభించింది.
కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఏటా పెట్రో కెమికల్ సెక్టారులో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డులను బహూకరిస్తుంది. 2019 ఏడాదికి ‘సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్రీన్ ప్రొడక్ట్’ కింద డాక్టర్ చిరంజీవి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత పెట్రోలియం, కెమికల్స్ లిమిటెడ్ (నోయిడా)లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా డాక్టర్ చిరంజీవి పనిచేస్తున్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎఫ్‌ఐసీసీఐ-సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్రీన్ ప్రొడక్
ఎప్పుడు : నవంబర్ 9
ఎవరు : ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి
ఎందుకు : పెట్రో కెమికల్ సెక్టారులో విశేష కృషి చేసినందుకు

మాదిరిప్రశ్నలు
1. 2019 ఏడాదికి ఎఫ్‌ఐసీసీఐ-సస్టైనబిలిటీ అవార్డ్ ఫర్ బెస్ట్ గ్రీన్ ప్రొడక్ట్ కింద ఎవరు ఎంపికయ్యారు?
1. డాక్టర్ అనంత శర్మ
2. డాక్టర్ కృష్ణస్వామి అయ్యర్
3. డాక్టర్ తోట చిరంజీవి
4. డాక్టర్ సందీప్ సింగ్
సమాధానం : 3
Published date : 11 Nov 2019 05:49PM

Photo Stories