Skip to main content

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభం

దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పనే లక్ష్యంగా రూపొందించిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై) ప్రారంభమైంది.
Current Affairs

సెప్టెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అలాగే ఈ-గోపాల యాప్, బిహార్‌లో మరికొన్ని పథకాలను, 50 కోట్లకు పైగా పశువులకు ఫుడ్ అండ్ మౌత్, బ్రుసెల్లోసిస్ వంటి వ్యాధులు సోకకుండా ఉచితంగా టీకా వేసే కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.ఫిషరీస్‌తోపాటు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా రైతులు, ఉత్పత్తి దారుల ఆదాయం పెంచుతామని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు.

పీఎంఎంఎస్‌వై-ముఖ్యాంశాలు

  • పీఎంఎంఎస్‌వై కింద వచ్చే ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.
  • ఈ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి, దేశ స్వావలంబనకు వీలవుతుంది.
  • వచ్చే ఐదేళ్లలో మత్స్య ఉత్పత్తులను రెట్టింపు చేస్తూ..అదనంగా 70 లక్షల టన్నుల మేర ఉత్పత్తిని పెంచి 2024-25 కల్లా ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల ఆదాయం సాధించమే పథకం లక్ష్యం.
  • 2020-21 నుంచి 2024-25 వరకు అమలయ్యే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా పీఎంఎంఎస్‌వై రూ.20,050 కోట్లతో అమలు అవుతుంది.
  • మత్స్య రంగంలో ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు వీలుగా మత్స్య శాఖను ఏర్పాటు చేయనున్నారు.
  • ఈ-గోపాల యాప్‌లో పశుపోషణ, ఆరోగ్యం, దాణా, ఉత్పాదకత వంటి అంశాలపై సమస్త సమాచారం ఉంటుంది. ఈ-గోపాల్‌ను యానిమల్ ఆధార్‌కు అనుసంధానం చేస్తారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్‌వై)ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : దేశ మత్స్య ఎగుమతులు రెట్టింపు చేయడం, రైతు ఆదాయం, మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పనే లక్ష్యంగా
Published date : 11 Sep 2020 05:14PM

Photo Stories