ప్రధాని నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ ఎంత?
Sakshi Education
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 15న తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు.
ఈ వివరాల ప్రకారం 2020, జూన్ 30 నాటికి ప్రధాని మొత్తం ఆస్తుల విలువ రూ.2.85 కోట్లుగా ఉంది. 2019 ఏడాది మొత్తం ఆస్తుల విలువ రూ.2.49 కోట్లతో పోల్చితే రూ.36 లక్షలు పెరుగుదల కనిపించింది.
నెల జీతం రూ. 2 లక్షలు.. సొంత కారు లేదు...
నెల జీతం రూ. 2 లక్షలు.. సొంత కారు లేదు...
- మోదీ నెల జీతం రూ. 2 లక్షలు. అందులో కరోనా సాయం కింద 30శాతం ఆయన వేతనంలోంచి కట్ అవుతోంది.
- ప్రధాని సేవింగ్స్ అకౌంట్‌లో రూ. 3.38 లక్షలు ఉన్నాయి. నగదు రూపంలో ఆయన దగ్గర రూ.31,450 మాత్రమే ఉన్నాయి.
- గుజరాత్ గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ అకౌంట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.1.60 కోట్ల ఉన్నాయి.
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ రూపంలో రూ. 8.5 లక్షలు. రూ. 7.61 లక్షలు ఉన్నాయి. జీవిత బీమా పథకం కింద రూ.1.51 లక్షలు, రూ.1.90 లక్షలు కడుతూ ఉంటారు.
- నాలుగు బంగారం ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువుండే వాటి విలువ రూ1.5 లక్షలుగా ఉంది.
- గాంధీనగర్‌లో పూర్వీకుల నుంచి వచ్చిన ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.1 కోట్లు. కుటుంబ సభ్యులతో పాటు మోదీకి ఆ ఇంట్లో 25% హక్కు ఉంది.
- ప్రధానికి సొంత కారు లేదు. అప్పులు కూడా లేవు.
Published date : 19 Oct 2020 12:45PM