ప్రధాని మోదీ ప్రారంభించిన పత్రికా గేట్ ఏ నగరంలో ఉంది?
Sakshi Education
రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో పత్రికా గ్రూప్ నిర్మించిన పత్రికా గేట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 8న ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.
అలాగే పత్రికా గ్రూప్ చైర్మన్ గులాబ్ కొఠారి రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... భారత్ మీడియా చెప్పే విషయాలను ప్రపంచ దేశాలు శ్రద్ధగా వింటున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు, పథకాల అమలుని మీడియా తీవ్రంగా విమర్శించినప్పటికీ, ఆ విమర్శలే భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఆన్‌లైన్ కార్యక్రమంలో రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పత్రికా గ్రూప్ నిర్మించిన పత్రికా గేట్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జైపూర్, రాజస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : పత్రికా గ్రూప్ నిర్మించిన పత్రికా గేట్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : జైపూర్, రాజస్తాన్
Published date : 09 Sep 2020 06:03PM