ప్లాస్టిక్‌ను తినే బ్యాక్టీరియా గుర్తింపు
Sakshi Education
ప్లాస్టిక్‌ను తినేయగల 2 రకాల బ్యాక్టీరియాలను గ్రేటర్ నోయిడాలోని శివ్ నాడార్ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
చిత్తడి నేలల్లో గుర్తించిన ఈ రెండు బ్యాక్టీరియాలకు ఎగ్జిగోబ్యాక్టీరియం సిబ్రికం స్ట్రెయిన్ డీఆర్11, ఎగ్జిగోబ్యాక్టీరియం అండే స్ట్రెయిన్ డీఆర్14 అని పేరు పెట్టారు. ఒక్కసారి వాడిపారేసే(సింగిల్ యూజ్ ప్లాస్టిక్-ఎస్‌యూపీ) ప్లాస్టిక్‌లో కీలక పదార్థమైన పాలిస్టిరీన్‌ను ఈ బ్యాక్టీరియా నాశనం చేయగలదని వర్సిటీ శాస్త్రవేత్త రిచా ప్రియదర్శిని తెలిపారు. ప్లాస్టిక్‌ను తినే బ్యాక్టీరియాతోపాటు తాము కొన్ని వైవిధ్యభరితమైన ఇతర బ్యాక్టీరియాను కూడా యూనివర్సిటీలోనే ఉన్న చిత్తడి నేలల్లో గుర్తించామని వర్సిటీ వైస్ చాన్స్ లర్ రూపమంజరి ఘోష్ పేర్కొన్నారు.
మన దేశంలో ఏటా దాదాపు కోటీ అరవై ఐదు లక్షల టన్నుల ప్లాస్టిక్ వినియోగం జరుగుతుండగా, కోటీ నలభై లక్షల టన్నుల పాలిస్టిరీన్ ఉత్పత్తి జరుగుతోందని అంచనా. రీసైక్లింగ్ వ్యవస్థలు లేకపోవడం వల్ల ప్లాస్టిక్ అటు జలచరాలకు ఇటు భూ ఉపరితల జీవజాలానికీ చేటు తెచ్చేలా పరిణమించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్లాస్టిక్‌ను తినే బ్యాక్టీరియా గుర్తింపు
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : గ్రేటర్ నోయిడాలోని శివ్ నాడార్ వర్సిటీ శాస్త్రవేత్తలు

Published date : 11 Oct 2019 04:50PM