Skip to main content

పేటీఎం ఫస్ట్ గేమ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన క్రికెటర్?

పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం ఫస్ట్ గేమ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ నియమితులయ్యారు.
Current Affairs
‘‘కోట్లాది మంది అభిమానించే సచిన్.. దేశంలోని ఫాంటసీ క్రీడల పట్ల అవగాహన కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తాడు. అలాగే కబడ్డీ, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్‌తో సహా అన్ని క్రీడల ప్రాముఖ్యతను ప్రచారం చేస్తాడు’’ అని పేటీఎం ఒక ప్రకటనలో తెలిపింది.

విద్యుత్ స్మార్ట్ మీటర్ల కోసం జాయింట్ వెంచర్ ఏర్పాటు
దేశంలో స్మార్ట్ విద్యుత్ మీటర్లను వేగంగా అమలు చేసేందుకు తగిన ఉమ్మడి సదుపాయాల కల్పనకు (సీబీఐఎఫ్).. ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో రూ.2,000 కోట్లతో జాయింట్ వెంచర్ ఏర్పాటు కానుంది. ఎన్‌టీపీసీ, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్ భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ ఏర్పాటవుతుంది. ఒక్కో కంపెనీ రూ.150 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాయి. అంటే నాలుగు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి రూ.600 కోట్లను పెట్టుబడిగా పెడుతుంటే, మరో రూ.1,400 కోట్లు డెట్ రూపంలో ఉండనుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పేటీఎం ఫస్ట్ గేమ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన క్రికెటర్
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : సచిన్ తెండూల్కర్
ఎందుకు : దేశంలోని ఫాంటసీ క్రీడల పట్ల అవగాహన కల్పించేందుకు
Published date : 16 Sep 2020 05:29PM

Photo Stories